Here is the video of Modi leading the ambulance
mictv telugu

అంబులెన్స్‌కు దారిచ్చిన మోదీ..వీడియో ఇదిగో

September 30, 2022

Here is the video of Modi leading the ambulance

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. వీడియోను వీక్షిస్తున్న వారందరూ మనిషి ప్రాణాల పట్ల ఆయన చూపించిన మానవత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు దేశ ప్రధానిగా కొనసాగుతూ, తీరిక లేకుండా ప్రజలకు సేవ చేస్తూ, అంబులెన్స్ పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని కీర్తిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ కాన్యాయ్‌లో ప్రయాణిస్తున్నాడు. ప్ర‌ధాని వెళుతున్న మార్గంలో ఆయ‌న కాన్వాయ్ వెనుక నుంచి ఓ అంబులెన్స్ వ‌స్తుండ‌గా ఆయన గమనించి, వెంటనే త‌న కాన్వాయ్‌ను రోడ్డుపైనే ఆపి, ఆ అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఆ అంబులెన్స్ త‌న కాన్వాయ్‌ను దాటిన త‌ర్వాతే మోదీ త‌న కాన్వాయ్‌ను ముందుకు కదిలించామని డ్రైవర్‌కు తెలియజేశాడు. ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో బంధించిన ఓ అధికారి..సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

ఇక, గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌ విషయానికొస్తే..గాంధీ న‌గ‌ర్‌- ముంబైల మ‌ధ్య సెమీ హైస్పీడ్ వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ నుంచి తొలుత అహ్మ‌దాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా గాంధీ న‌గ‌ర్‌కు బ‌య‌లుదేరారు. అలా కొంత‌దూరం వెళ్ల‌గానే, త‌న కాన్వాయ్ వెనుకాల అంబులెన్స్ వ‌స్తున్న విషయాన్ని గుర్తించిన మోదీ, త‌న కాన్వాయ్‌ను రోడ్డుకు ఎడ‌మ ప‌క్క‌గా ఆపించి, అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.