చేపకు మనిషి ముఖం..వణుకుతున్న జనం - MicTv.in - Telugu News
mictv telugu

చేపకు మనిషి ముఖం..వణుకుతున్న జనం

November 9, 2019

సముద్రాల్లో మత్స్య కన్యలు ఉన్నారని, చాలాసార్లు వారు తమ కంటపడ్డారని జాలర్లు చెపుతుంటారు. అది ఎంతవరకు నిజమనేది శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. కానీ, తాజాగా మనిషిని పోలిఉన్న ఓ చేప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దక్షిణ చైనాలో మియో గ్రామంలో ఓ మహిళకు చెరువులో మనిషి ముఖంతో ఉన్న చేప ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే ఆమె ఆశ్చర్యానికి గురైంది. వెంటనే దాన్ని వీడియో తీసి చైనాకు చెందిన సోషల్ మీడియా సైట్ ‘విబో’లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసినవాళ్లు ఇది చాలా భయంకరంగా ఉందని, దీన్ని తినే ధైర్యం ఎవరికి ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ చేప అలా ఎందుకు ఉందని తెలియాల్సి ఉంది.