herion Laya interview getting popular in social media
mictv telugu

హీరోయిన్ లయ అంబానీకి రిలేషన్ అంటూ వీడియో చక్కర్లు

March 14, 2023

herion Laya interview getting popular in social media

హీరోయిన్ లయ తెలియని వాళ్ళెవ్వరూ ఉండరు. అచ్చ తెలుగింటమ్మాయి. హీరో వేణుతో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లయ ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోలతో నటించింది. పెద్ద పెద్ద కళ్ళతో నాజూగ్గా ఉండే లయ అంటే అందరికీ చాలా ఇష్టం కూడాను. ఎక్స్పోజ్ చేయకుండా టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వాళ్ళల్లో లయ ఒకరు. హోమ్లీ క్యారెక్టర్లకు పెట్టింది పేరు.

మొదటిసినిమాతోనే లయకు మంచి ఆఫర్లు వచ్చాయి. సాధారణంగా తెలుగు హీరోయిస్లు ఎక్కువ కాలం కెరీర్లో ఉండరు. ఒకటి రెండు సినిమాలు చేసి ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా తెరమరుగు అయిపోతారు. కానీ లయ మాత్రం అలా కాదు. ఎక్కువ కాలమే ఇండస్ట్రీలో ఉంటూ మంచి సినిమాలు చేసింది. మంచి పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది.

పెళ్ళయిన తర్వాత లయ ఎవ్వరికీ కనిపించలేదు. కనీసం మీడియాకు కూడా టచ్‌లో లేదు. కానీ సడెన్‌గా లయ లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఇన్స్టా, యూట్యూబ్ రీల్స్ పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అలా ఇండియా వచ్చిన లయను చాలా మీడియా వాళ్ళు ఇటర్వ్యూ చేశారు. అందులో ఒకటి బాగా పాపులర్ అయింది. ఆ వీడియో ముక్కలు ముక్కలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో లయకు, అంబానీకి ఉన్న రిలేషన్ తెలుసా అంటూ ఓ వీడియో బాగా వైరల్ కూడా అయింది.

లయకు, అంబానీకి రిలేషన్ ఎలా అంటూ వీడియో ఓపెన్ చేస్తున్న జనాలు తర్వాత నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. తొక్కలో థంబ్ నెయిల్స్ అంటూ తిట్టిపోస్తున్నారు. అసలు మేటర్ విషయానికి వస్తే ఇంటర్వ్యూలో లయ భర్త గురించి, ఆస్తుల గురించి అడిగారు. మీరు చాలా గొప్ప ఆస్థిపరులంట కదా అంటూ సదరు యాంకర్ క్వశ్చన్ అడిగింది. దానికి లయ వ్యంగ్యంగా అవునండీ నేను అంబానీ చెల్లెలిని అంటూ సమాధానం ఇచ్చింది. లేకపోతే ఏంటండీ ఏదో నా భర్త డాక్టర్, ఆయనకు మూడు ప్రవైట్ హాస్పటల్స్ ఉన్నాయి. కొంత డబ్బులున్నమాట వాస్తవమే కానీ మరీ అంత ధనవంతులమేమీ కాదు అంటూ సమాధానం ఇచ్చింది. ఆ వీడియోనే సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హెడ్డింగులు పెడుతూ వైరల్ చేస్తున్నారు.