పుత్రికోత్సాహంలో అల్లు అర్జున్ ! - MicTv.in - Telugu News
mictv telugu

పుత్రికోత్సాహంలో అల్లు అర్జున్ !

August 1, 2017

అల్లు అర్జున్ ముద్దుల తనయతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముద్దుగా, క్యూట్ గా, ఎంతో లవ్లీగా వుంది పాప. పాప పేరు అల్లు అర్ష. కొడుకు పేరమో అయాన్. ఇద్దరి పేర్లు ‘ అ ’ తో ప్రారంభమౌతాయి. అయాన్ ఇప్పటికే తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నాడు. ఆ మధ్య డిజె ఆడియో ఫంక్షన్ లో అందరికీ చేతులెత్తి నమస్కరించి అందరినీ విశేషంగా అలరించాడు. అర్ష కూడా అయాన్ లా ఎన్ని చిలిపి పనులు చేస్తుందోనని తండ్రిగా చాలా ఎగ్జైట్ మెంటులో వున్నట్టున్నాడు అర్జున్. పుత్రికోత్సాహంలో మునిగి తేలుతున్నాడు. షూటింగ్ లేనప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలతోనే తనకు మంచి ఆటవెలది అంటున్నాడు. అంతేకదా ఇంట్లో పిల్లలుంటే గొప్ప రిలీఫ్. వాళ్ళ అల్లరి, చిలిపి చేష్టలతో ఇల్లంతా సందడిగా వుంటుంది. షూటింగ్ నుండి ఎంతో అలిసిపోయి ఇంటికొచ్చి పిల్లల్ని చూడగానే ఎంతో రిలీఫ్ గా ఫీలౌతానంటున్నాడు.