అదిరిందయ్యా బాలయ్యా.. కొత్త గెటప్ అదిరింది!
నందమూరి బాలకృష్ణ కొత్త స్టైల్‌లో కేక పుట్టిస్తున్నారు. యంగ్ లుక్‌లో కనిపిస్తూ ప్రస్తుత హీరోలకు పోటీగా తయారయ్యారు. కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో వస్తున్న బాలయ్య కొత్త సినిమా కోసం తన గెటప్ పూర్తిగా మార్చేశారు. తాజాగా బ్యాంకాక్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఓ అభిమాని తీసుకున్న ఫొటోలో ఆయన కొత్త స్టైల్‌లో కనిపించారు. ఈ లుక్ చూసిన జనం ఆయన నిజంగా బాలయ్యేనా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బాలయ్య సరికొత్త లుక్‌పై నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. గెటప్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
జై సింహ తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా చేస్తున్నారు. డాన్ పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక,ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ నటిస్తున్నారు. డాన్ పాత్ర కావడంతో అందుకు తగ్గట్టుగానే బాలయ్య రెడీ అయిపోయారు. ఈ సినిమా కోసం బ్యాంకాక్‌లో ఇటీవల తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. ఈ సమయంలోనే అభిమానితో దిగిన ఓ సెల్ఫీతో బాలయ్య గెటప్ బయటకు వచ్చింది.