నందమూరి బాలకృష్ణ, సినీ నటుడి, రాజకీయ నాయకుడి ఎంతో గుర్తింపు ఉంది. హీరోగా బాలకృష్ణకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాలే కాదు…బుల్లితెరపై టాక్ షోలోకు హోస్టుగా వ్యవహారిస్తూ సత్తా చాటారు. ఇప్పుడు బాలయ్య బాబు తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. క్రికెట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు కామెంటేర్ గా అవతారం ఎత్తేందుకు బాలయ్యబాబు రెడీ అవుతున్నారు.
IPL బాలకృష్ణ కామెంటరీతో అదరగొట్టనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ ఓపెనింగ్ రోజు బాలయ్య బాబు కామెంటరీ ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేసింది.
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్😎
ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్🤩
నందమూరి బాలకృష్ణ గారు😍తెలుగుజాతి గర్వపడేలా 🔥
సంబరాన్ని అంబరాన్ని అంటేలా🥳
ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది🤩మరి మిస్ అవ్వకుండా చూడండి StarSportsTelugu/HD#IPLOnStar #JaiBalayya #BalaKrishna #HushaaruOn pic.twitter.com/GpARnqMdgg
— StarSportsTelugu (@StarSportsTel) March 26, 2023