సంక్రాంతి కానుకగా నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు రోజుల ముందే అభిమానులకు సంక్రాంతి పండుగను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆరు షోలకు అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు ప్రారంభమయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఓ రేంజ్ లో సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వీరసింహారెడ్డి విడుదలైన థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. మరోవైపు భాగ్యనగరంలో పలు థియేటర్ల వద్ద అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సందడి చేశారు.
అభిమానులు, ప్రేక్షకులతో కలిసి వీరసింహారెడ్డి ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షించేందుకు బాలకృష్ణ భ్రమరాంబ థియేటర్‌కి చేరుకుని సందడి చేశారు. దీంతో.. కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల సందడి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఫైర్ క్రాకర్లు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు సందడి సృష్టించాయి. బాలయ్యబాబు, గోపీచంద్ మలినేనిలతో పాటు చిత్ర యూనిట్ అభిమానులతో కలిసి థియేటర్ వద్ద సందడి చేశారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూశారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. విదేశాల్లో తెల్లవారుజామున 2 గంటలకే షోలు మొదలయ్యాయి. మ రోవైపు వీరసింహారెడ్డి సినిమా కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్లింది. నిజానికి బాలయ్య సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరగడం ఇదే తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్‌తో హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరులో 30 లక్షలు, చెన్నైలో 4 లక్షలు, వరంగల్‌లో 17.58 లక్షలు, ముంబైలో 1.52 లక్షల రూపాయలు సొంతం చేసుకుంది.