బిడ్డను పాతిపెట్టిన తల్లి.. కాపాడిన 3 కాళ్ల  కుక్క - MicTv.in - Telugu News
mictv telugu

బిడ్డను పాతిపెట్టిన తల్లి.. కాపాడిన 3 కాళ్ల  కుక్క

May 20, 2019

15 ఏళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన  ఓ మైనర్ బాలిక.. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ బిడ్డను మట్టిలో పూడ్చేసింది. అది పసిగట్టిన ఓ కుక్క వెంటనే ఆ బిడ్డను కాపాడింది.

Hero dog saves life of newborn after teen mom buries boy alive in Thailand.

థాయ్‌లాండ్‌లోని బ్యాన్ నాంగ్‌ ఖామ్‌ప్రాంతానికి చెందిన ఓ బాలిక.. 15 ఏళ్లకే గర్భవతి అయ్యింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే.. తనని చంపేస్తారేమోనని  ప్రసవించగానే బిడ్డను గొయ్యి తీసి మట్టిలో పూడ్చేసింది. అక్కడే తిరుగుతున్న ఓ కుక్క దీన్నంతా గమనించింది. వెంటనే మట్టిని తవ్వింది. శిశువు కాలు కనిపించింది. కుక్క యజమాని యుసా నసైకా వెంటనే ఆ శిశువును బయటకు తీసి ఆస్పత్రిలో చేర్చాడు. శిశువు బతికే ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. శిశువును కాపాడిన కుక్క పేరు పింగ్ పాంగ్. దానిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పింగ్ పాంగ్‌కు మూడు కాళ్లే పనిచేస్తున్నాయి. ప్రమాదంలో ఓ కాలు చచ్చుబడిపోయింది.