హీరో కొత్త ఎలక్ట్రిక్ బైకులు.. మైలేజీ 100 - MicTv.in - Telugu News
mictv telugu

 హీరో కొత్త ఎలక్ట్రిక్ బైకులు.. మైలేజీ 100

August 19, 2019

Hero Electric Optima ER.

 లిథియం బ్యాటరీతో నడిచే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను హీరో సంస్థ సోమవారం విడుదల చేసింది. ఆప్టిమా ఈఆర్‌, ఎన్‌వైఎక్స్‌ ఈఆర్‌ పేరిట వీటిని మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. వీటి ధరలను వరుసగా రూ.68,721, రూ.69,754గా నిర్ణయించినట్లు కంపెనీ సీఈవో సోహిందర్‌ గిల్‌ వెల్లడించారు. 4.5 గంటల నుంచి 5 గంటల పాటు ఛార్జింగ్‌ పెడితే ఫుల్‌ఛార్జ్‌ అవుతుందని, దీంతో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చని ఆయన తెలిపారు. 

బ్యాటరీపై మూడేళ్ల వారెంటీ కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ సదుపాయం కల్పించే ఏకైక కంపెనీ తమదేనని వివరించారు. ప్రస్తుతం లిథియం బ్యాటరీ ధర రూ.18వేల వరకు ఉందని.. భవిష్యత్తులో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయయని తెలిపారు. రెండు మూడేళ్లలో సగం ధరకే ఇవి లభించే అవకాశం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా  కంపెనీ కొత్త కార్పొరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు.