అత్తరు వ్యాపారంలోకి మహేష్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

అత్తరు వ్యాపారంలోకి మహేష్ బాబు

March 10, 2020

Mahesh Babu

టాలీవుడ్ సెలబ్రెటీలు సినిమాలు చేస్తూనే చాలా మంది వ్యాపారాల్లోకి అడుగుపెడుతూ ఉంటారు. కొందరు ప్రొడ్యూసర్లుగా మారితే ఇంకొందరు రకరకాల బిజినెస్‌లు ప్రారంభిస్తారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటులు వ్యాపార రంగాల్లో దూసుకెళ్తున్నారు. వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఆయన చాలా రోజులుగా ఏఎంబీ సినిమాస్, హంబుల్ డ్రెస్సెస్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈయన మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారట. 

మహేశ్ పెర్‌ఫ్యూమ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారనే ప్రచారం చిత్ర పరిశ్రమలో జరుగుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆయన త్వరలోనే ఈ రంగంలోకి దిగబోతున్నారట. ఇప్పటికే 22 బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. తాజాగా మరో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మరీ ఇది ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. కాగా టాలీవుడ్‌లో మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకెళ్తున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరికొత్త వ్యాపారంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.