విజయ నిర్మల విగ్రహావిష్కరణలో ఏడ్చేసిన మహేష్  - MicTv.in - Telugu News
mictv telugu

విజయ నిర్మల విగ్రహావిష్కరణలో ఏడ్చేసిన మహేష్ 

February 20, 2020

Hero Mahesh Babu React On Vijaya Nirmala

నటి, మహిళా దర్శకురాలు దివంగత విజయనిర్మల 74 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నానక్‌రామ్ గూడలోని సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు నరేష్,మహేష్ బాబు, నమ్రత పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డు పురస్కారాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి అందజేశారు. టాలీవుడ్‌లో ఆమె చేసిన సేవలను కొనియాడారు.

విగ్రహావిష్కరణ తర్వాత హీరో మహేష్ బాబు మాట్లాడారు. విజయ నిర్మలతో ఉన్నఅనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ‘నా సినిమాలు విడుదలైన తర్వాత నాన్న, విజయ నిర్మల గారు చూసి నాకు ఫోన్ చేసే వారు. అలాగే ఇటీవల విడుదలైన సినిమా చూసిన నాన్న ఫోన్ చేశారు. ఆ వెంటనే ఆమె మాట్లాడుతుందని అనుకున్నా. కానీ అప్పటికే ఆమె లేరనే విషయం గుర్తొచ్చి బాధవేసింది. ఆమె లేనిలోటు తెలిసింది. ఏ లోకంలో ఉన్న సంతోషంగా ఆమె ఉండాలి’ అని ఆకాంక్షించారు. నటుడు నరేష్ మాట్లాడుతూ.. అమ్మపేరుతో ప్రతి ఏటా అవార్డులు ప్రధానం చేస్తామని చెప్పారు.