విజయ్ దేవరకొండ .. ఒక సీన్  కోసం 8 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ దేవరకొండ .. ఒక సీన్  కోసం 8 కోట్లు

May 21, 2019

యూత్ ఫేవరేట్ స్టార్ అయిన హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న సినిమా ‘హీరో’. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో విజయ్ ప్రొఫేషనల్ బైకర్‌గా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం విజయ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడట. అయితే ఇందులో ఒక సీన్ చిత్రీకరణ కోసం నిర్మాతలు ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఆ సీన్‌ సినిమాలో కీలకంగా నిలుస్తుందని ఎంత ఖర్చుకైనా నిర్మాతలు వెనుకాడటంలేదు. ఢిల్లీలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఆనంద్ అన్నామలై దర్శకుడిగా తెరకు పరిచయం అవుతున్నాడు.

Hero makers spending Rs 8 Crore on his bike race scene

మాళవికా మోహనన్‌ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇదిలావుండగా విజయ్ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం జులై 26న విడుదలకు సిద్ధం అవుతోంది.