Hero Naga Shaurya Marriage With Anusha Shetty
mictv telugu

బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై.. ఘనంగా హీరో నాగశౌర్య పెళ్లి

November 20, 2022

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ యువ నటుల్లో ఒకరైన నాగశౌర్య నేడు నవంబర్ 20న తన లేడీ లవ్ అనూషా శెట్టిని వివాహమాడి తన బ్యాచలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు. అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేసాడు నాగశౌర్య. వివాహానికి ముందు నవంబర్ 19న కర్ణాటకలో మెహందీ, కాక్‌టెయిల్ పార్టీలు జరిగాయి. ఆ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాగ శౌర్య, అనూషా శెట్టిల మెహందీ వేడుక నవంబర్ 19 మధ్యాహ్నం జరిగింది. ఈ ఫంక్షన్ కోసం నాగ శౌర్య నలుపు రంగు పటియాలా, నీలిరంగు కుర్తాను ధరించగా.. భార్య అనూష ఆరెంజ్, గ్రీన్, పింక్ షేడ్స్‌లో ఎంబ్రాయిడరీ లెహంగాలో మెరిసింది.

ఇక సాయంత్రం 8 గంటలకు జరిగిన కాక్‌టెయిల్ పార్టీలో వెస్ట్రన్ వేర్ డ్రెస్ కోడ్ పెట్టారు. నలుపు రంగు సూట్‌లో నాగ శౌర్య, పర్పుల్ సీక్విన్డ్ డ్రాప్-డెడ్ లో కనిపించింది అనూష. ఈ పార్టీలోనే శౌర్య త‌న‌కు కాబోయే భార్య అనూష శెట్టి వేలికి ఉంగ‌రం తొడిగాడు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బంధువులు, కుటుంబ సన్నిహితుల మధ్య పెళ్లి కొడుకు వేడుకను గ్రాండ్‌గా జరిపారు. అతి తక్కువ మందిని మాత్రమే ఈ పెళ్లి కొడుకు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక బెంగళూరులోని జెడబ్ల్యూ మారియట్‌లో గ్రాండ్‌గా నాగశౌర్య వివాహం జరిగింది. ముందుగా నిశ్చయించిన సమయం ప్రకారం ఉదయం 11.25గంటలకు నాగ‌శౌర్య నూతన వధువు అనూష మెడలో బంధు, మిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేశాడు.