hero naga shourya arranged delicious wedding lunch
mictv telugu

అష్టభుజ ఆకారంలో.. అద్భుతమైన విందు భోజనం

November 21, 2022

పెళ్లంటే హడావిడి, పెళ్లంటే అతిధులు. పెళ్లంటే ఆశీర్వాదాలు.. అన్నింటికీ మించి పెళ్లంటే భోజనాలు. సకల హంగులు, ఆర్బాటాలున్నా లేకున్నా కమ్మని భోజనం ఉండాల్సిందే. నాన్ వెజ్ ప్రియులు సైతం పెళ్లి భోజనాన్ని ఆస్వాదిస్తారు. అందుకే పెళ్ళి భోజనంపై అందరు ప్రత్యేకమైన ఫోకస్ పెడతారు. అతిథులకు అద్భుతమైన విందు భోజనం పెట్టేందుకు రోజులకు రోజులు ఇళ్లల్లో చర్చలు జరుగుతాయి. తాజాగా హీరో నాగశౌర్య పెళ్లిలో కూడా అద్భుతమైన విందు భోజనం పెట్టారని, భోజనాల కోసం నాగ శౌర్య చేసిన ఏర్పాట్లు అద్భుతమని ప్రశంసలు వస్తున్నాయి. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో ఉదయం 11:25 గంటలకు పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టికి నాగ శౌర్య మూడుమూళ్లు వేశాడు.

సాంప్రదాయ పట్టు పంచెకట్టులో నాగశౌర్య.. ఎరుపు, బంగారు వర్ణం పట్టుచీరలో అనూష శెట్టిలు తాజా పూలతో అలంకరించిన పెళ్లి మండపంలో మెరిశారు. ఇక పెళ్లి తంతు అనంతరం అతిథులకు అదిరిపోయే వివాహ విందు ఇచ్చారు నాగశౌర్య-అనూష దంపతులు. అతిథుల కోసం స్టార్ హోటల్ అదిరిపోయే అరేంజ్‌మెంట్స్ చేసింది. మన సంప్రదాయం ప్రకారం బంతి భోజనాలు పెట్టారు. అయితే, ఒక్కో అతిథికి ఒక్కో టేబుల్ వేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉండగా.. ఇదొక యూనిక్ స్టైల్ అంటున్నారు. విందులో పలు రకాల పసందైన వంటకాలతో అతిథులకు మరిచిపోలేని పెళ్లి భోజనాన్ని వడ్డించారు. దీనికి సంబదించిన ఓ వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.