నాగశౌర్యకు జరిమానా.. వద్దంటే వింటేనా? - MicTv.in - Telugu News
mictv telugu

నాగశౌర్యకు జరిమానా.. వద్దంటే వింటేనా?

August 13, 2019

Naga Shourya..

ట్రాఫిక్ రూల్స్‌కు ఎవరూ అతీతులు కాదని హైదరాబాద్ పోలీసులు మరోసారి నిరూపించారు. ఇటీవల అల్వాల్ సమీపంలో మంచిర్యాల జాయింట్ కలెక్టర్ కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతో చలాన్ వేయడం తెలిసిందే. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు కూడా చలనాలు పడ్డాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ఫైన్ వేశారు. తాను ప్రయాణిస్తున్న కారుకు నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వాడటంతో పంజాగుట్ట పోలీసులు రూ. 500 ఫైన్ వేశారు. 

పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్‌నెం.1లో రెగ్యూలర్ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అటుగా వస్తున్న నాగశౌర్య కారును ఆపి అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి ఫైన్ వేశారు. ఇటీవల ఓ బేబీ చిత్రంలో కనిపించిన నాగశౌర్య ప్రస్తుతం సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.