Hero Naga Shourya Fires On Man Who Slapped Girl On Road
mictv telugu

నడిరోడ్డుపై యువకుడితో గొడవపడ్డ హీరో నాగశౌర్య

February 28, 2023

 

Hero Naga Shourya Fires On Man Who Slapped Girl On Road

సినిమాల్లో నడిరోడ్లపై ఎవరైనా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే… హీరోలు వచ్చి వాళ్ల తాట తీసి బుద్ధి చెప్పడం చూస్తుంటాం. మరి, నిజ జీవితంలో హీరోలు అలా ఉంటారా? అంటే తప్పకుండా ఉంటారని ప్రూవ్ చేశాడు రియల్ హీరో నాగశౌర్య. నడిరోడ్డు మీద ఓ యువకుడిని నిలదీసి… అబ్బాయితో సారీ చెప్పించి…ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. తాను వెళ్తున్న దారిలో ఓ అబ్బాయి మరో అమ్మాయిని రోడ్డు మీద కొడుతున్నాడని, కారు ఆపి ఆమెకు సారీ చెప్పాలని ఆ యువకుడితో గొడవకు దిగాడు నాగశౌర్య. ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్‌ అని చెప్తుండగా.. గర్లఫ్రెండ్ అయితే కొడతావా అంటూ ఆ అమ్మాయికి సారీ చెప్పాలని గొడవపడుతున్నాడు. ఆ అబ్బాయి వెళ్లిపోతుంటే చేయిని లాగి మరీ సారి చెప్పమంటూ అంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మహిళల పట్ల నాగశౌర్య చూపించిన గౌరవ మర్యాదల పట్ల నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. నాగశౌర్య ప్రస్తుతం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్‌ చేశాయి. ఇక ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవికా నాయర్‌ నటిస్తుంది.