hero naga shourya still in hospital and naga shourya health update
mictv telugu

నాలుగు రోజుల్లో పెళ్లి.. నాగశౌర్య ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు

November 16, 2022

 

షూటింగ్ లో స్పృహతప్పి పడిపోయిన నాగశౌర్యని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో శౌర్యకి మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. అయితే ఇది జరిగి రెండు రోజులు అయిపోయింది. ఇంకా ఆసుపత్రి నుండి నాగశౌర్య డిస్చార్జ్ అవ్వలేదన్న వార్తా ఇండస్ట్రీలో, అభిమానుల్లో ఇప్పుడు ఆందోళనలు కలిగిస్తుంది. షూటింగ్ లో స్ట్రెస్, డీ హైడ్రేషన్ కారణంగా శౌర్య స్పృహ తప్పిపోయాడని చిత్ర బృందం ఇప్పటి వరకు చెప్తూ వస్తుంది. అయితే నాగశౌర్య ఆనారోగ్యానికి ప్రస్తుతం మరో కారణం కూడా చెప్తున్నారు. అదే అతి వ్యాయామం. సిక్స్ ప్యాక్ కోసం కొద్దీ రోజులుగా నాగశౌర్య విపరీతంగా వర్కౌట్స్ చేస్తున్నాడట.

లో కార్బో డైట్, లిక్విడ్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటున్నాడట. దీంతో నాగశౌర్య బలహీనపడ్డాడని.. దానికి తోడు జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్నాడని ఈ కారణంగానే నాగశౌర్య అనారోగ్య పాలయ్యాడని వార్తలొస్తున్నాయి. ఇక ప్రస్తుతం అభిమానులు నాగ శౌర్య అనారోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటల 25 నిమిషాలకు నాగశౌర్య వివాహం. మరికొన్ని గంటల్లో పెళ్లి కొడుకు అవ్వాల్సిన నాగ శౌర్య ఇలా ఆసుపత్రి బెడ్ పై ఉండడం ఏంటీ.. అసలు శౌర్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. ఏదైనా సీరియస్ మ్యాటరా.. కేవలం డీ హైడ్రేషన్ అయితే ఇన్ని రోజులు చికిత్స ఏంటీ అంటూ ఆందోళన చెందుతున్నారు అభిమానులు. గత కొన్ని రోజులుగా వరుసగా సెలబ్రెటీలకు హార్ట్ అటాక్స్ వస్తుండటం.. అది కూడా అతి వ్యాయాయం కారణంగానే అని వైద్య నిపుణులు చెప్తుండటం జరుగుతూ వస్తుంది. అయినా హీరోలు తమ పాత్రల కోసం హెవీ వర్కౌట్స్ మాత్రం ఆపటం లేదు. వెంటనే తమ శరీరాల శక్తి సామర్థ్యం మేరకే జిమ్ చేయాలనీ డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.