Home > Featured > నాగ శౌర్యని మించిన.. కాబోయే భార్య భారీ బ్యాక్ గ్రౌండ్

నాగ శౌర్యని మించిన.. కాబోయే భార్య భారీ బ్యాక్ గ్రౌండ్

యువ హీరో నాగ శౌర్య పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టికి నవంబర్ 20న బెంగుళూరులో మూడుముళ్లు వేయబోతున్నాడు. వీరిద్దరి వివాహ ఆహ్వాన పత్రిక కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైలెంట్ గా కనిపించే శౌర్య అసలు ఎప్పుడు ప్రేమలో పడ్డాడు, సడెర్న్ గా పెళ్లి ఏంటీ అంటూ వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్న తరుణంలో శౌర్యకి కాబోయే భార్య బ్యాగ్రౌండ్ పై కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ భార్యకి లేని బ్యాగ్రౌండ్ మా నాగశౌర్య వైఫ్ కి సొంతమంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. దీంతో అసలు అనూష ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? శౌర్య కు ఎప్పటి నుండి పరిచయం? వంటి విషయాలపై సామాన్య జనాలు ఆరాలు తీస్తున్నారు.

అనూషా శెట్టి ఇండియాలోనే ఒక ఫెమస్ ఇంటీరియర్ డిజైనర్ అని తెలుస్తోంది. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుండి ఇంటీరియర్ డిజైన్ చేయటమే కాకుండా.. ఎంట్రప్రెన్యూర్ షిప్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కూడా కలిగి వుంది అనూషా శెట్టి. డిజైనర్ ఆఫ్ ది ఇయర్ 2019 & 2020 టైటిల్ ను గెలిచిన అనూష శెట్టి ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఎక్సలెన్స్ అవార్డుల్లో దేశంలోని 40 ఏళ్లలోపు 40 మంది అత్యుత్తమ ఇంటీరియర్ డిజైనర్లలో ఒకరిగా నిలిచారు. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మ్యాగజైన్ లో కూడా అగ్రశ్రేణి డిజైనర్ గా అనుషా శెట్టి కథనాన్ని కవర్ పేజీలో ప్రచురించారు. ఆమె ప్రస్తుతం ఇంటీరియర్స్ ఆర్కిటెక్చర్ లో ఓ కంపెనీని కూడా నడుపుతోందని సమాచారం. దీంతో దేశంలోనే పేరున్న పెద్ద పారిశ్రామికవేత్త, టాప్ ఇంటీరియర్ డిజైనర్ గా అనూష శెట్టిని శౌర్య పెళ్లి చేసుకోనుండటంతో.. ఈమె బ్యాగ్రౌండ్ ఒకరకంగా నాగశౌర్య కంటే పెద్దదని చెప్పొచ్చు. టాలీవుడ్ లోని ఏ స్టార్ హీరోల భార్యకి ఈ స్థాయిలో బ్యాగ్రౌండ్ లేదంటూ నాగశౌర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటం గమనార్హం.

Updated : 11 Nov 2022 12:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top