Hero Nagarjuna Emotional Crying After Watching Oke Oka Jeevitham Premier Show
mictv telugu

భార్య యాక్టింగ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న హీరో నాగార్జున

September 8, 2022

యంగ్ హీరో శర్వానంద్‌ నటిస్తున్న తాజా సినిమా ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. డ్రీమ్ వారియ‌ర్స్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్‌ఆర్ ప్ర‌భు నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని అమల, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

‘ఒకే ఒక జీవితం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టాలీవుడ్‌ సినీ ప్రముఖుల కోసం బుధవారం ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. సినిమా చూసిన టాలీవుడ్ కింగ్ నాగార్జున థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాలో తల్లీకొడుకులుగా నటించిన తన భార్య అమల, శర్వానంద్ ల నటనను చూసి తన తల్లిని గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. సినిమా చూసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ… ‘ఒకే ఒక జీవితం సినిమా భావోద్వేగభరితంగా ఉంది. దర్శకుడు చాలా అందంగా తీశారు. తల్లి సెంటిమెంట్‌ ఉన్న ఈ సినిమా చూస్తే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది’ అన్ని అన్నారు. ఇదే చిత్రాన్ని తమిళంలో ‘కణం’ పేరుతో విడుదల చేయనున్నారు.