hero nagasourya marriage fix
mictv telugu

నాగశౌర్య పెళ్లి ఫిక్స్..వధువు ఆమెనే..

November 10, 2022

hero nagasourya marriage fix

మరో టాలీవుడ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరో నాగశౌర్య పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అనూష అనే యువతిని నాగశౌర్య వివాహామాడనున్నాడు. నవంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటల 25 నిమిషాలకు నాగశౌర్య-అనూషల వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం జరగనుంది. బెంగుళూరులోని విటల్ మాల్యా రోడ్ లోని జెడబ్ల్యూ మారియోట్ హోటల్‌ను వివాహ వేదికగా ఫిక్స్ చేసారు.

అయితే నాగశౌర్య పెళ్లిచేసుకోబోతున్న యువతి కోసం సెర్చింగ్ మొదలైంది. అనూష ఎవరు, ఏం చేస్తారు అన్న దానిపై ఆసక్తిగా వెతికేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఇక నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. అనూష, నాగశౌర్య కుటుంబ సభ్యులకు అతి దగ్గర బంధువు అని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆమెతో ప్రేమలో ఉన్న నాగశౌర్య పెద్దల అభిప్రాయంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి.