Hero Nandu Responds On Love Affair With Anchor Rashmi At Bomma Blockbuster Pre Release Event
mictv telugu

యాంకర్ రష్మితో ఎఫైర్.. స్టేజిపై అసలు విషయమంతా చెప్పేసిన హీరో నందు

November 3, 2022

హీరో నందు, యాంకర్ రష్మీల చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగశౌర్య రాగా.. ప్రత్యేక అతిధిగా సుడిగాలి సుదీర్ వచ్చాడు. రాజ్ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ బొమ్మా బ్లాక్ బస్టర్ చిత్రం ట్రైలర్స్, టీజర్స్ ఇప్పటికే ఆడియన్స్ ని ఆకట్టుకోగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం మంచి పబ్లిసిటీ దక్కించుకుంది. సుదీర్ రష్మీల చిలిపి చేష్టలు, కమెడియన్స్ నవ్వుల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ ఈవెంట్ కి నందు స్పీచ్ హైలైట్ గా నిలిచింది. కెరీర్ ఆరంభం నుండి ఒక్క హిట్ కోసం తపిస్తున్న నందు తన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్ర షూటింగ్ కష్టాలు పంచుకున్నాడు. అయితే మాటల్లో యాంకర్ రష్మీ గొప్పతనాన్ని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తనకి రష్మీకి తప్పుడు సంబంధం అంటకడుతున్నారని.. కానీ రష్మీది చాలా గొప్ప మనసంటూ ఆకాశానికి ఎత్తేశాడు నందు.

మేము బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర షూటింగ్ లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. చిన్న బడ్జెట్ కావటంతో చిత్ర బృందం 40-50 మందిమి కలిసి అచ్యుతాపురంలో ఒకటే రూమ్‌లో ఉండేవాళ్లం. నా బాధ చూసి.. రష్మి ఇక తట్టుకోలేక మా ఇల్లు.. ఇక్కడికి చాలా దగ్గర.. వచ్చి మా ఇంట్లో ఉండ్రా అన్నది. వాళ్ల అమ్మ రాత్రింబవళ్లు నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నాకు వండి పెట్టి ఎంతో బాగా చూసుకున్నారు. ఆమె రుణం ఎన్నటికి తీర్చుకోలేను. ఆమెకు కాళ్లకు దండం పెట్టినా తప్పు లేదు. ఇక సినిమా ప్రమోషన్స్‌ కోసం రష్మీని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చింది. ఆటోలో తిప్పినా ఏం ఫీలవ్వలేదు. ఇప్పటి వరకు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఫ్రెండ్‌ కోసం తాను అంత చేస్తుంది. అలాంటి రష్మీ గురించి కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారు. తనతో లింకులు పెట్టి గాసిప్స్ రాయటం తప్పు భయ్యా. రష్మీ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే అంటూ ఎమోషనల్ అవుతూ రష్మీని కౌగిలించుకున్నాడు నందు. ఇక ఇండస్ట్రీలో అందరికి నేనంటే ఇష్టమే కానీ ఎవ్వరు నాకు సహాయం చేయలేదని చెప్పాడు. ఈ కథని పట్టుకుని ఎంతోమంది నిర్మాతలని కలిశానని కానీ ఎవ్వరు ప్రొడ్యూస్ చేయకపోవటంతో నేనే నిర్మాతగా మారినట్టు చెప్పాడు హీరో నందు.