Hero Nani announced that he will release a song from the movie Dussehra
mictv telugu

దసరా నుంచి బిగ్ అప్‌డేట్.. సిల్క్‌స్మిత సాక్షిగా ప్రకటించిన నాని

September 29, 2022

Hero Nani announced that he will release a song from the movie Dussehra

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ‘దసరా’ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో నాని ఊర మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. శ్యామ్ సింగరాయ్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.

అలాగే నేను లోకల్ తర్వాత నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. కరోనా కారణంగా కొంతకాలం షూటింగ్ ఆలస్యమైనా ఇప్పుడు శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. కొద్ది రోజుల్లో దసరా పండుగ రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అప్డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. ఈ విషయాన్ని హీరో నాని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దసరా రోజు దసరా సినిమా నుంచి మాస్‌లో కెల్లా మాస్ సాంగ్ ‘ధూమ్ ధామ్ దోస్తానా’ అనే పాటను విడుదల చేస్తున్నట్టు నాని ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేయగా, అందులో అలనాటి తార సిల్క్‌స్మిత పోస్టర్ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ వీడియో చూస్తే 90 లలో జరిగిన కథాంశంగా పలువురు అంచనా వేస్తున్నారు. సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో తెలియజేస్తామని చిత్ర బృందం తెలిపింది.