తొలిసారి ఊర మాస్ గెటప్ లో న్యాచురల్ స్టార్ నాని చేస్తున్న తాజా చిత్రం దసరా. నాని కెరీర్‌లో ఇది అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. సాఫ్ట్ ఇమేజున్న నానిని ఫస్ట్ టైం మాస్ కి కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేస్తున్నారు. కొద్దిరోజుల కింద విడుదల చేసిన దసరా మాస్ బీట్ కి సూపర్ రెస్పాన్స్ రాగా ఇప్పుడు తాజాగా దసరా అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేశారు. పవర్ ప్యాక్ మోడ్ లో కట్ చేసిన ఈ ట్రైలర్ అభిమానులకు ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. ఈ దసరా యాక్షన్ డ్రామాని శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
ఇక 1980 తెలంగాణలోని సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. ఇప్పటికే రిలీజ్ అయినా దసరా ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై హైప్ ని పెంచేశాయి. ముఖ్యంగా నాని రా లుక్స్ కట్టిపడేస్తున్నాయి. విజువల్స్ కూడా అత్యంత సహజంగా ఉన్న లొకేషన్స్ లో షూట్ చేయటంతో ప్రేక్షకులను గతంలోకి తీసుకెళ్లినట్లు ఉంది. సింగరేణి నేపథ్యంలో చోటుచేసుకున్న సంఘటనలు కళ్లకు కట్టిగనట్లు చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ సినిమా నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.