యుద్ధానికి సిద్ధం కండి.. హీరో నాని..
నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఐదుగురు ఆడవాళ్లు తమ పగ తీర్చుకునేందుకు హీరో నానిని కలిసి పథకం వేసే సన్నివేశాలను ఇందులో చేర్చారు. దీంట్లో హీరో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాడనే నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇది తొలిసారి పెన్సిల్ రాసిన ఒరిజినల్ స్టోరీ అంటూ నాని ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
జెర్సీ సినిమాతో హిట్ మీద ఉన్న నాని ఈసారి సరికొత్తగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించాడు. దీంట్లో నాని పెన్సిల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ వాటిని తెలుగులోకి ట్రాన్స్‌లెట్ చేస్తూ ఉంటాడు.ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. RX 100 సినిమాలో హీరోగా నటించిన కార్తికేయ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని, కార్తికేయ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.