hero nani visted yadadri temple
mictv telugu

‘దసరా’ను ఆడిపించు దేవుడా.. యాదాద్రిలో నాని స్వామి

November 10, 2022

hero nani visted yadadri temple

నేచురల్ స్టార్ నాని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన నానికి అర్చకులు వేదమంత్రాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ ప్రసాదాలను అందించారు. అలాగే నాని ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. నాని ప్రస్తుతం దసరా అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్‌ యాక్షన్‌ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాపై నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.ఈ మధ్య వచ్చిన సినిమాలు పెద్దగా కలెక్షన్స్ రాబట్టకపోవడంతో ‘దసరా’ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయాలకు తిరుగుతూ తమ చిత్రానికి ఆశీస్సులను కోరుతున్నారు.