Dasara : లక్నోలో దసరా ట్రైలర్ లాంచ్..లారీ ఎక్కి సందడి చేసిన నాని..! - Telugu News - Mic tv
mictv telugu

Dasara : లక్నోలో దసరా ట్రైలర్ లాంచ్..లారీ ఎక్కి సందడి చేసిన నాని..!

March 15, 2023

ఇప్పుడు సౌత్ స్టార్స్ కళ్లన్నీ పాన్ ఇండియా మార్కెట్ మీదనే ఉన్నాయి. తెలుగు హీరోలకు నార్త్ మార్కెట్లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. దీంతో మన హీరోలందరూ ఒక్కొక్కరుగా హిందీ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఆ జాబితాలో చేరారు నేచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా నటించిన తాజా మూవీ దసరా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. నాని తొలిసారిగా తన సినిమాను దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 30న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. మూవీ రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో నాని ప్రచారంపై దృష్టిపెట్టారు. దీనిపై భాగంగానే యూపీలోని లక్నోలో ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రతిభ థియేటర్లో నిన్న సాయంత్రం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ నాని, ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్, నటుడు దీక్షిత్ శెట్టి హాజరయ్యారు.

ఇక నానికి ఘనస్వాగతం పలికారు లక్నో ప్రేక్షకులు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ప్రతిభ థియేటర్ దగ్గర లారీ ఎక్కిన నాని…మరింత ఊపు తీసుకువచ్చారు. అంతేకాదు లక్నోలో ప్రముఖ రెస్టారెంట్ రాయల్ కేఫ్‌కు తన ‘దసరా’ టీమ్‌తో కలిసి వెళ్లిన నాని అక్కడ ప్రత్యేకమైన చాట్‌ రుచి చూశారు. అంతేకాదు, నాని స్వయంగా చాట్ తయారుచేశారు. రెస్టారెంట్‌కు వచ్చిన కొంత మంది కస్టమర్లకు దాన్ని సెర్వ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ద్రుశ్యాలు వైరల్‌గా మారాయి. కాగా ఇఫ్పటివరకు తెలుగు హీరోలంతా హిందీ మార్కెట్‌లో ప్రచారం చేసేందుకు ముంబై వెళ్లారు. నాని డిఫరెంట్‌గా లక్నో వెళ్లి అందరినీ చూపును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.