Hero Nani’s lucky escape in Dasara shoot
mictv telugu

దసరా షూటింగ్‌లో హీరో నానికి తప్పిన పెను ప్రమాదం

August 7, 2022

విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ త‌నకంటూ ప్రత్యేక గుర్తింపును ద‌క్కించుకున్న హీరోల్లో నాని ఒక‌రు. ఇటీవల ‘అంటే సుందరానికి’ సినిమాతో అలరించిన నాని.. రాబోయే తన కొత్త సినిమాల షూటింగులతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే నాని.. ఓ సినిమా షూటింగ్‌లో పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు తాజా సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో నాని హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా ‘దసరా’. ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్ వేసి చిత్రీక‌రిస్తున్నారు. షూటింగ్‌లో స‌మ‌యంలో ఓ బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా.. బొగ్గంత అతడి పై పడినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు నానికి గాయాలు ఏమీ కాలేదట. దీంతో కాసేపు షూటింగ్ నిలిపివేశారని..నాని పూర్తిగా సిద్ధం అయ్యాకే షూటింగ్ ని మళ్లీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ గోదావరిఖనిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నాని లుక్ పరంగా ఈ సినిమాలో సరికొత్తగా ట్రై చేస్తున్నారు.