టాలీవుడ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నవదీప్ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జై సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి 18 ఏళ్లు అవుతుంది. కెరీర్ ప్రారంభంలో హీరోగా సినిమాలు చేసి ఆకట్టుకున్న నవదీప్ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ ఫ్రెండ్‌గా కనిపించిన నవదీప్ తర్వాత మోసగాళ్లు సినిమాలోనూ విష్ణు మంచు స్నేహితుడిగా కనిపించారు. ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో నవదీప్ తన పెళ్లి మీద స్పందించాడు. తాను నాస్తికుడిని అని, తాను ఏదీ నమ్మనని, ఇంట్లో వాళ్లు కూడా తన పెళ్లి గురించి అడగడం మానేశారని, తాను కూడా పట్టించుకోవడం లేదని నవదీప్ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా పెళ్లి మీద తనకు ఉన్న ఉద్దేశ్యాన్ని చెప్పేశాడు. అది కూడా గరికపాటి ప్రవచనాల రూపంలో. గరికపాటి పెళ్లి గురించి చెప్పిన మాటలను తను ఇన్ స్టా స్టోరీలో నవదీప్ షేర్ చేశాడు.
ఈ ప్రపంచంలో సుఖంగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది పెళ్లి చేసుకోకుండా ఉన్నవారే.. పెళ్లి చేసుకుంటే నిత్యం బాధలే.. అదే పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ తిన్నా, ఎక్కడ పడుకున్నా.. ఏం చేసినా ఎవ్వరూ అడగరు.. పెళ్లి చేసుకుని మేం కష్టాలు పడుతున్నాం.. నువ్ కూడా పడాల్సిందే అని పెళ్లి చేస్తారు. అంతే కానీ సుఖపడాలని పెళ్లి చేయరు అంటూ గరికిపాటి ఇలా చెప్పుకుంటూ పోయాడు. అందులోని ఓ కొటేషన్ సత్రం, మటన్, సుఖం ఇవి చాలు అన్నట్టుగా నవదీప్ కూడా చెప్పుకొచ్చాడు. అంటే నవదీప్‌కు ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదనట్టుగా కనిపిస్తోంది.