హీరో నిఖిల్ ఇంట్లో విషాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

హీరో నిఖిల్ ఇంట్లో విషాదం..

April 28, 2022

టాలీవుడ్ యంగ్ స్టార్ నిఖిల్ ఇంట్లో విషాదం నెలకొంది. అతని తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో చనిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్యామ్.

ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖలు నిఖిల్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ‘కార్తికేయ’ చిత్రంతో సత్తా చాటిన నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ 2’ షూటింగ్‌లో ఉన్నారు. ‘18 పేజెస్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ‘స్పై’ అనే పేరుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు.