hero nikhil strong reply to divorce rumors
mictv telugu

షాకింగ్.. పెళ్ళైన రెండేళ్లకే విడాకులు.. హీరో నిఖిల్ స్ట్రాంగ్ రిప్లై

November 19, 2022

డ్రెస్సులు మార్చినంత ఈజీగా విడాకులు తీసుకుంటుంది నేటి యువత. చిన్నచిన్న కారణాలకే కలకాలం కలిసుండాల్సిన కాపురాలు పెటాకులవుతున్నాయి. కార్పొరేట్ కల్చర్ పెరిగి స్త్రీకి వచ్చిన ఆర్థిక, సామజిక స్వేచ్ఛే విడాకులకు కారణమని మొగవాళ్ళు అంటుంటే.. మహిళల అభ్యున్నతిని సహించలేకే డివోర్స్ జరుగుతున్నాయని స్త్రీలు వాదిస్తున్నారు. అయితే కారణమెవరైనా కానీ బంధాలు మాత్రం విరిగిపోతున్న మాట వాస్తవం. ముఖ్యంగా సెలబ్రెటీ జంటలు అయితే పెద్ద ఎత్తున విడాకులు తీసుకుంటూ చర్చనీయాంశం అవుతున్నారు. బాలీవూడ్ టు టాలీవుడ్ రోజుకొక కపుల్ కటీఫ్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా తెలుగు యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా భార్య పల్లవి వర్మతో విభేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. కొన్నాళ్ల క్రితం నుంచి నిఖిల్ తన భార్యతో సరిగ్గా ఉండడం లేదని, ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

అయితే సోషల్ మీడియాలో తన భార్య ఫోటోలని కొద్దిరోజులుగా నిఖిల్ పెట్టకపోవటాన్ని ఉదహరిస్తున్నారు. చేతిని చూసి జ్యోతిష్యం చెప్పేలా.. నేడు సోషల్ మీడియా పోస్టులతో భార్యాభర్తల రిలేషన్ ఎలా ఉందొ అంచనాలు వేస్తున్నారు. ఇది గమనించో లేక రూమర్స్ కి చెక్ పెట్టాలనుకున్నారో ఏమో కానీ అదే సోషల్ మీడియా ద్వారా తనపై వస్తున్న విడాకుల రూమర్స్ పై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు నిఖిల్. తాను తన భార్యతో గోవాలో ఉన్నట్లుగా ఒక ఫోటో షేర్ చేసి మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు చాలా బెటర్ గా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక తన భార్యతో తాను గోవాలో ఉన్నట్లు కూడా హింట్ ఇచ్చాడు నిఖిల్. భార్యతో కలిసున్న ఫొటో ఒకటి పెట్టి దానికి ఒక క్యాప్షన్‌ జత చేశాడు. “నీతో కలిసున్న ప్రతి నిమిషం అద్భుతం పల్లవి” అంటూ నిఖిల్‌ కామెంట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ చూసిన నిఖిల్‌ ఫ్యాన్స్ అంతా.. సూపర్‌ కపుల్‌, బెస్ట్‌ కపుల్‌ మీరు అంటా కామెంట్‌ చేస్తున్నారు.