hero nithin father gives clarity on power peta movie
mictv telugu

హీరో నితిన్ సినిమాను ఆపేశాము

June 9, 2022

hero nithin father gives clarity on power peta movie

జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో ఆకట్టుకున్న హీరో నితిన్. తెలంగాణ నుంచి వచ్చిన హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందినా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాతో ఓ రేంజులో దూసుకెళ్లిపోయాడు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం అనే సీరియస్ సినిమాను చేస్తున్నాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ అన్న విషయం తెలిసిందే. కమల హాసన్ నిర్మించి నటించిన తాజా హిట్ చిత్రం విక్రమ్‌ను ఆయన తన బ్యానర్‌పై తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.

సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు వసూళ్లు కూడా రికార్డు స్థాయిలో ఉండడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో గతంలో నితిన్ హీరోగా ప్రకటించిన ‘పవర్ పేట’ సినిమా గురించి వ్యాఖ్యానించారు. ‘సొంత బ్యానర్లో ఈ సినిమా చేద్దామనుకుని అనౌన్స్ కూడా చేశాం. సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాల్సింది. అయితే స్క్రిప్టు సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమాను ఆపేశామ’ని స్పష్టం చేశారు. కాగా, నితిన్ ప్రస్తుతం చేస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది.