నితిన్ పెళ్లి తేదీ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా.? - MicTv.in - Telugu News
mictv telugu

నితిన్ పెళ్లి తేదీ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా.?

July 1, 2020

vbnvbn

టాలీవుడ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు అయ్యేందుకు అంతా సిద్ధమైంది. తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రియురాలు షాలినితో పెళ్లి తేదీని ఫిక్స్ చేసుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన వివాహ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు ఈ నెల 26న పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఫలక్ నూమా ఫ్యాలెస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేయనున్నారు. 

నితిన్ – షాలినికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. ఆ వెంటనే ఏప్రిల్ 15న పెళ్లి చేయాలని అనుకున్నారు. దుబాయ్‌లో ఈ వేడుక ఘనంగా చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు ఇప్పట్లో ఆ అవకాశం లేకపోవడతో హైదరాబాద్‌లోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ నెల 26న సరిపోయే ముహూర్తం ఉండటంతోనే అదే సమయానికి మూడు ముళ్లు వేయించనున్నారు. మొత్తానికి చాలా రోజులుగా నితిన్ పెళ్లి ఇదిగో.. అదిగో అంటూ వచ్చిన పుకార్లకు చెక్ పడింది. కాగా ఇటీవల భీష్మ సినిమా హిట్‌తో మరోసారి ట్రాక్ ఎక్కిన ఆయన ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు.