హీరో ప్రభాస్‌కు అసలు ఏమైంది..? అనారోగ్య సమస్యతో నిజంగా బాధపడుతున్నాడా..? షూటింగ్‌కు బ్రేక్ చెప్పి మరీ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లనున్నాడా? అంటే అవుననే అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియన్ సినిమా బాహుబలితో వరల్డ్ వైడ్‌గా ప్రభాసుకు క్రేజ్ లభించింది. రాధే శ్యాం తరువాత ప్రభాస్ కాస్త గ్యాప్ తీసుకుని వరుసగా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్ వంటి భారీ సినిమాలు చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలు ప్రభాస్ క్రేజ్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌కు సంబంధించి ఏ విషయం బయటికి వచ్చినా అది కొద్ది గంటల్లోనే సెన్సేషన్‌గా మారుతుంది. గత కొంతకాలంగా ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో లవ్ లో ఉన్నాడని నెట్టింట్లో అనేక రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ రూమర్లపై ఇద్దరు స్టార్స్ స్పందించినా ఇప్పటికీ అవే రూమర్స్ కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ ఆరోగ్యం మళ్లీ క్షీణించిందన్న వార్తలు నెట్టింట్లో సెన్సేషన్‌గా మారాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదని, ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్ర పొందుతున్నారని సమాచారం. త్వరలోనే మెరుగైన చికిత్స కోసం ఫారెన్‌కు వెళ్లనున్నట్లు సన్నిహితులు తెలిపారు.
సోషల్ మీడియాలో చలామని అవుతున్న ఈ వార్త నేపథ్యంలో నిజంగా ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ అంశంపై టాలీవుడ్ మీడియా ఎలాంటి అప్డేట్స్ అందించలేదు. కేవలం బాలీవుడ్ మీడియా మాత్రమే ఈ విషయాన్ని హైలెట్ చేస్తోంది. ఈ క్రమంలో ఇదంతా ప్రభాస్ క్రేజ్‌ను తగ్గించేందుకు బాలీవుడ్ చేస్తున్న కుట్ర అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.