రాజశేఖర్ కుటుంబానికి కరోనా.. మొత్తం నలుగురికీ  - MicTv.in - Telugu News
mictv telugu

రాజశేఖర్ కుటుంబానికి కరోనా.. మొత్తం నలుగురికీ 

October 17, 2020

gngnfgn

టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వదిలిపెట్టడం లేదు. వరుసగా నటులు, సినీ ప్రముఖులు వ్యాధిబారిన పడుతూనే ఉన్నారు. ఓ వైపు సినిమా షూటింగ్‌లు కూడా ప్రారంభం కావడంతో వైరస్ మరింత భయపెడుతోంది. తాజాగా నటుడు జీవితా రాజశేఖర్‌ కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే శనివారం స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇటీవల వీరికి కుటుంబానికి కరోనా వచ్చిందనే ప్రచారం జరిగింది. అది  నిజమేనని ఆయన నిర్ధారించారు. 

తమ ఆరోగ్యంపై ట్విట్టర్ ఖాతాలో రాజశేఖర్ స్పష్టతనిచ్చారు. ‘ఈ వార్త నిజమే.. జీవిత, పిల్లలు, నేను కరోనా బారిన పడ్డాము. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. పిల్లలు ఇద్దరూ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం నేను, జీవిత కూడా బాగానే ఉన్నాం. త్వరలోనే ఇంటికి తిరిగొస్తాం’ అని పేర్కొన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా తమ ఆరోగ్యంపై ఆరా తీసిని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆయన తీస్తున్న సినిమా షూటింగ్ చిత్ర యూనిట్ వాయిదా వేసింది.