ఐసీయూలోనే హీరో రాజశేఖర్.. హెల్త్ బులిటెన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఐసీయూలోనే హీరో రాజశేఖర్.. హెల్త్ బులిటెన్ విడుదల

October 27, 2020

టాలీవుడ్ హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.  హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వైద్యులు మంగళవారం ఆయన పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం ఆయనకు ఇంకా ఐసీయూలోనే చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. కరోనాకు సంబంధించిన చికిత్స చేస్తున్నామని మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. 

ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారని తెలిపారు. ప్లాస్మా,  సైటోసార్బ్ థెరపీ జరుగుతోందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తున్నట్టుగా తెలిపారు. కాగా, ఇటీవలే రాజశేఖర్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు కూడా కరోనా బారిన పడ్డారు. వారంతా కోలుకోగా, ఆయన పరిస్థితి మాత్రం మారకపోవడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.