హీరో రామ్ కోసం మోకాళ్ళ‌తో తిరుమ‌ల మెట్లెక్కిన ఫ్యాన్ - MicTv.in - Telugu News
mictv telugu

హీరో రామ్ కోసం మోకాళ్ళ‌తో తిరుమ‌ల మెట్లెక్కిన ఫ్యాన్

July 10, 2019

హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కావాల‌ని సందీప్ అనే ఆయన అభిమాని మోకాళ్ళ‌తో తిరుమ‌ల మెట్లెక్కాడు. దానికి సంబందించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి తీరా రామ్ కి చేరింది. దీంతో రామ్ భావోద్వేగంతో స్పందించారు. ఆ వీడియోను రామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ డియ‌ర్ సందీప్‌.. నీ ప్రేమ నా గుండెను తాకింది. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావ‌ని అనుకుంటున్నాను. మీరు నాపై ఇంత ప్రేమ చూపించ‌డానికి నేను ఏం చేశానో అర్ధం కావ‌డం లేదు. మీలాంటి వారంద‌రి కోసం నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మీలాంటి అభిమానులు నాకు దొర‌క‌డం నా అదృష్టం’ అని పేర్కొన్నారు.