యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్

March 2, 2022

ramm

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘యుద్ధంలో పోరాడేందుకు ఏ దేశమైనా ఇతర దేశాల్లో తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు. కానీ, యుద్ధం జరుగుతున్న దేశాల్లోని తమ పౌరులను కాపాడుకోవడం కోసం సైన్యాన్ని పంపడం

అనేది ఆయా దేశాల ఖచ్చితమైన బాధ్యత’గా పేర్కొన్నారు. అయితే హీరో రామ్ ఈ ట్వీట్ ను భారత ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను తీసుకురావడానికి మన దేశం బుధవారం వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలను పంపింది. ఈ నేపథ్యంలో
హీరో రామ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.