రామ్ కు ఆ డైరెక్టరే కరెక్టా ? - MicTv.in - Telugu News
mictv telugu

రామ్ కు ఆ డైరెక్టరే కరెక్టా ?

August 1, 2017

ఈ మధ్య ‘ నేను శైలజ ’ సినిమాతో హిట్టు కొట్టిన రామ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద చాలా జాగ్రత్తగా అడుగులు కదుపుతున్నాడు. శివం, హైపర్ సినిమాలు ఫ్లాపవడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. నేనూ శైలజ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమలతోనే తన తదుపరి సినిమా చేసి మళ్ళీ హిట్టు కొట్టాలనే ప్రయత్నంలో వున్నట్టున్నాడు రామ్. తనకు ఆ డైరెక్టరైతేనే కరెక్టనుకున్నట్టున్నాడు. వెంటనే ముహూర్తం కూడా పెట్టుకొని, ఆ మధ్య కొబ్బరికాయ కూడా కొట్టి 50 శాతం షూటింగ్ కూడా ముగించుకున్నారు .

‘ ఉన్నది ఒక్కటే జిందగీ ’ అనే టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ ఆగస్టు 6 నుండి ఊటీలో వుంటుందట. ఫ్యామిలీ రొమాంటిక్ గా రూపొందుతోందట. రామ్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా వున్నాడట ఈ క్రేజీ ప్రాజెక్టు మీద. కిషోర్ తిరుమల మేకింగ్ స్టైల్, సినిమాను అతను తీర్చి దిద్దే విధానం చాలా బాగుంటుందని రామ్ అభిప్రాయం. చూడాలి ఈ సినిమా రామ్ కు, కిషోర్ తిరుమలకు మళ్ళీ హిట్టిచ్చి కలిసొస్తుందో లేదో ?