‘జగన్‌ గారూ కుట్ర జరుగుతోంది జాగ్రత్తా’: హీరో రామ్ సంచలన ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘జగన్‌ గారూ కుట్ర జరుగుతోంది జాగ్రత్తా’: హీరో రామ్ సంచలన ట్వీట్

August 15, 2020

Hero Ram on Jagan

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని సంచలన ట్వీట్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఏపీ రాజకీయాలపై ఆయన స్పందించారు. ‘జగన్ గారూ మీకు తెలియకుండా పెద్ద కుట్ర జరుగుతోన్నట్టుంది’ అంటూ ఏపీ సీఎం జగన్‌కు జాగ్రత్తలు చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఏనాడు వివాదాల్లో వేలుపెట్టని ఆయన ఉన్నట్టుండి ఇలా ట్వీట్ చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

శనివారం మధ్యాహ్నం  1.17 గంటల సమయంలో ఈ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘సీఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. వైఎస్ జగన్ గారూ, మీ కింద పనిచేసే కొంత మంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్ఠకు, మేం మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. అలాంటి వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. #APisWatching కూడా జత చేశారు.

ఇటీవల హోటల్ స్వర్ణ ప్యాలస్‌‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?’ అని ప్రశ్నించారు. ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ అంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన ఆయన అభిమానులు పలు ప్రశ్నలు సందిస్తున్నారు. ఎవరా వ్యక్తులు అంటూ ఆరా తీస్తున్నారు. ఇంత సడెన్‌గా ఆయన ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది.