ఎలుకకు గోల్డ్ మెడల్.. దీని కథ పెద్దదే! - MicTv.in - Telugu News
mictv telugu

ఎలుకకు గోల్డ్ మెడల్.. దీని కథ పెద్దదే!

September 25, 2020

n mvbh m

ఓ ఎలుక గోల్డ్ మెడల్ సాధించింది. దానికి ఇచ్చిన పతకం పేరు ‘పీడీఎస్ఏ’ గోల్డ్ మెడల్. ఇప్పటివరకు ఈ మెడల్‌ను 30 జంతువులకు ఇచ్చారు. అయితే, ఈ మెడల్ గెలుచుకున్న మొదటి ఎలుక ఇదే కావడం విశేషం. ఇంతకీ ఈ ఎలుక ఏం సాధించింది అని దానికి బంగారు పతకాన్ని అందించారంటే.. ఆఫ్రికాకు చెందిన ఈ ఎలుక పోలీస్ జాగిలాల మాదిరి ఓ గొప్ప పని చేసింది. ఆఫ్రికన్ జెయింట్ ఎలుక ల్యాండ్ మైన్‌లను గుర్తించి ప్రతిష్టాత్మక బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ ఎలుక పేరు మగావా. దాని కెరీర్‌లో 39 ల్యాండ్‌మైన్‌లు, 28 మ్యూనిషన్‌లను గుర్తించి రికార్డు నెలకొల్పింది. కాంబోడియాలో డ్యూటీ చేస్తూ ప్రమాదకర ల్యాండ్‌మైన్‌లను గుర్తించింది. అంత చేసిన ఎలుక శ్రమను గుర్తించకపోతే ఎలా అనుకుని అధికారులు దానికి గోల్డ్ మెడల్ బహూకరించారు. 

ఈ ఎలుక వయసు ఇప్పుడు 7 ఏళ్లు. బెల్జియం దేశానికి చెందిన అపోపో చారిటీ సంస్థ ఎలుకలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ఈ ఎలుకకు కూడా అదే సంస్థ మంచి శిక్షణ ఇచ్చింది. వీటిని ‘హీరో రాట్స్’ అనే పేరుతో సమాజ సేవ కోసం పోలీసు బలగాలకు పంపిస్తారు. 1990ల నుంచి ఈ సంస్థ ఎలుకలను ట్రైన్ చేస్తోంది. ఎలుక పేరు మీద అపోపో చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టాఫ్ కొక్స్ పతకాన్ని అందుకున్నారు.