తమ్ముడి పాపం అన్నకు చుట్టుకుందా.. ? - MicTv.in - Telugu News
mictv telugu

తమ్ముడి పాపం అన్నకు చుట్టుకుందా.. ?

July 28, 2017

హీరో రవితేజ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యాడు . అయితే ఇక్కడ రవితేజకు తమ్ముడి పాపం తన మెడకు చుట్టుకుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల మరణించిన అతని తమ్ముడు భరత్ డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, హార్ష్ డ్రైంవింగ్ వంటి కేసుల్లో నిందితుడిగా వున్నాడు.

తమ్ముడి చావుకి కూడా రవితేజ రాలేకపోయాడు. కారణం ఏంటో తెలియవు గానీ.. తాజాగా రవితేజకు డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం వున్నట్టు నోటీసులు అందుకొని సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. ఇదంతా చూస్తుంటే తమ్ముడు చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు అన్న మెడకు చుట్టుకున్నట్టే అనిపిస్తున్నాయి ? తమ్ముడిలా అన్నకు కూడా డ్రగ్స్ అలవాటుందా ? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ఆమధ్య రవితేజ తల్లి కూడా తన కొడుక్కు డ్రగ్స్ అలవాటు అస్సల్లేదని చెప్పింది. తొలుత రవితేజ డ్రైవర్ శ్రీనివాస రావు పేరు కూడా డ్రగ్స్ వ్యవహారంలో వినిపించింది. ఏదేమైనా మాస్ మహారాజాగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన రవితేజకు యూత్ లో మంచి క్రేజ్ వుంది. సిట్ విచారణ అనంతరం రవితేజ ఏంటన్నది స్పష్టం అవుతుంది.