Hero Raviteja Missed The Nandamuri Kalyan Ram Bimbisara Movie
mictv telugu

వరుస ఫ్లాపులు.. బింబిసార వద్దనుకొని మరో తప్పు చేశాడు

August 8, 2022

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ముందుకు వెళుతోంది. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. చిత్రంలో క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టికే పలువురు సెల‌బ్రెటీలు చిత్రాన్ని వీక్షించి మేక‌ర్స్‌కు అభినంద‌నలు తెలుపుతున్నారు. కాగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది.

అయితే నిజానికి ఈ సినిమా ఒక స్టార్ హీరో కాదనుకున్నాడని తాజాగా టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా దర్శకుడు వశిష్ఠ.. కళ్యాణ్ రామ్ కంటే ముందు మాస్ మహారాజ హీరో రవితేజను ఈ కథతో సంప్రదించాడట. ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగిన తర్వాత రవితేజ కథ కూడా నచ్చిందట, అయితే ఈ సినిమా గురించి తర్వాత స్టేజిలలో ఆసక్తి చూపలేదని అంటున్నారు. కథ ప్రకారం చూసుకుంటే సినిమా రాచరికపు నేపథ్యంలో ఉంటుంది కాబట్టి కచ్చితంగా గ్రాండియర్ కావాలని, పెద్ద ప్రాజెక్టు కావడంతో కొత్త దర్శకుడు ఈ సినిమా హ్యాండిల్ చేయగలడా? లేడా? అనే విషయంలో రవితేజకు అనుమానం రావడంతోనే సైలెంట్ అయ్యాడని అంటున్నారు.