గుట్కా తరలింపు కేసులో సినీ హీరో సచిన్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

గుట్కా తరలింపు కేసులో సినీ హీరో సచిన్ అరెస్ట్

October 15, 2020

n vnbhn

బాలీవుడ్‌ను డ్రగ్ కేసు ఒక్కసారిగా కుదిపేసింది. పలువురు హీరోయిన్లు విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే మరో సంచలనం చోటు చేసుకుంది. గుట్కా ప్యాకెట్ల తరలింపు కేసులో హీరో సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ముంబైలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా గుట్కా దందా నడుపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అతన్ని విచారిస్తున్నారు. 

ఇటీవల హైదరాబాద్‌లో భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకొని నిందితులను విచారించగా సచిన్ జోషి ప్రమేయం ఉందనే సమాచారం అందింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. సచిన్ తండ్రికి గుట్కా వ్యాపారం ఉండటంతో దాంట్లో వందల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు సచిన్‌ కూడా అదే పని చేస్తున్నట్టుగా తేలడంతో బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. కాగా, నటుడిగా సచిన్ జోషి పలు తెలుగు సినిమాల్లోనూ నటించి అందరికి పరిచయం అయ్యారు. మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను అనే సినిమాలతో అప్పట్లో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఒరేయ్ పండు, జాక్ పాట్, వీరప్పన్, వీడెవడు లాంటి సినిమాలు కూడా చేశాడు.