Hero saves three-year-old girl hanging from eighth-floor window
mictv telugu

8 వ ఫ్లోర్ కిటికీకీ వేలాడిన చిన్నారి.. క్షణం ఆలస్యమైతే..

May 14, 2022

Hero saves three-year-old girl hanging from eighth-floor window

ఇళ్లల్లో చిన్నారులు ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు కాస్త బాధ్యత వహించాలి. వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే జరిగే ప్రమాదాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. కజకిస్తాన్ రాజధానిలో జరిగిన ఓ సంఘటన పిల్లల విషయంలో పెద్దలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తోంది. ఎనిమిది అంతస్తుల భవనంలోని పై అంతస్తులో 3ఏళ్ల చిన్నారి కిటికీ దగ్గర ఆడుతూ ఆడుతూ ప్రమాదవశాత్తు వెనక్కి జారిపడింది. ఈ క్రమంలో ఆ చిన్నారి.. భవనం పైనుంచి పూర్తిగా కింద పడిపోకుండా ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీ గ్రిల్‌ను పట్టుకుని వేలాడింది. ఆ సంఘటనను కళ్లారా చూసిన చాలామంది అయ్యో పాపం అనుకున్నారే కానీ బిల్డింగ్ పైకి వెళ్లి చిన్నారిని కాపాడి ధైర్యం చేయలేకపోయారు.

అదే సమయంలో స్నేహితుడితో కలసి అటుగా వెళ్తున్న సబిత్ అనే వ్యక్తి ఏడవ ఫ్లోర్‌కు వెళ్లి ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండానే స్నేహితుడి సహాయంతో చిన్నారిని కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సబిత్ చేసిన పనికి స్థానిక ప్రభుత్వం అభినందించింది. పాప వేలాడుతూ కనిపించినపుడు తనను కాపాడాలనే ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు వెళ్లినట్టు చెప్పాడు సబిత్. కాగా.. అతనికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.