టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) త్వరలో తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టబోతున్నాడు. రక్షితా రెడ్డి(Rakshitha Reddy)తో అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. నేడు ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన ఈ వేడుకలో శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ రామ్‌చరణ్ (Ram Charan), ఆయన భార్య ఉపాసన(Upasana) పాల్గొన్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు..
ఇక శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫోటో బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆరా తీయగా.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్దదిగానే తెలుస్తోంది. శర్వానంద్ ఆస్తిపాస్తులకి ఏ మాత్రం తగ్గకుండా కరెక్ట్ జోడీనే దొరికినట్లు అనిపిస్తోంది.
రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాదు, చిత్తూరు (ప్రస్తుతం తిరుపతి) జిల్లాకు చెందిన టీడీపీ లీడర్(TDP Leader).. శ్రీకాళహస్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి(Gopala Krishna Reddy) మనవరాలు. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా రక్షిత రెడ్డి.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అయ్యిందన్న మాట.