Hero Sharwanand In Arjun Movie After Vishwak Sen Rejection
mictv telugu

విశ్వక్ వివాదంలో మరో ట్విస్ట్.. హీరో అర్జున్ కి అండగా శర్వానంద్

November 9, 2022

Hero Sharwanand In Arjun Movie After Vishwak Sen Rejection

హీరోలు విశ్వక్ సేన్, అర్జున్ ల వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. అర్దాంతరంగా సినిమా నుండి వైదొలిగిన విశ్వక్ సేన్ ని టార్గెట్ చేస్తూ సీనియర్ హీరో అర్జున్ కి సపోర్టుగా నిలుస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఇప్పటికే నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అర్జున్ కి మద్దతుగా నిలబడ్డారు. విశ్వక్ సేన్ వంటి యువ హీరోలు అనవసరంగా దర్శకుల పనిలో వేలు పెడుతూ సినిమాలని చెడగొతున్నారని.. ఇలాగైతే విష్వక్ లాంటి హీరోలతో ఎవ్వరు సినిమాలు తీయరని కాస్త ఘాటైన విమర్శలు చేయగా.. ఇప్పుడు మరో యువ హీరో అర్జున్ కి మద్దత్తుగా ముండకొచ్చాడని వార్తలొస్తున్నాయి. కథ చెత్తగా ఉందంటూ విశ్వక్ విమర్శించిన సినిమాకి హీరో శర్వానంద్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. తన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావటంతో అర్జున్ ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా ఈ కథని తెలుగులో చేయాలన్న పట్టుదలతో శర్వానంద్ అయితే సూట్ అవుతారని భావిస్తున్నారట అర్జున్.

ఇందులో భాగంగానే శర్వాకి కథ కూడా న్యారేట్ చేశారట అర్జున్. ఫస్ట్ వెర్షన్ వరకు శర్వా సంతృప్తి వ్యక్తం చేశారని.. మరికొద్ది రోజుల్లో శర్వానంద్, అర్జున్ ల సినిమాపై మరింత క్లారిటీ రావొచ్చని ఇండస్ట్రీ టాక్. అయితే వరుసగా ఆరు ఫ్లాప్స్ తరువాత.. తాజా హిట్ ‘ఒకే ఒక జీవితం’ మూవీతో కంబ్యాక్‌ అయ్యాడు శర్వానంద్. ఈ నేపథ్యంలో తర్వాత చేయబోయే కథపై కూడా ఆచితూచి అడుగెలుస్తున్నారు శర్వానంద్. అయితే అర్జున్ కథకి శర్వా ఒకే చెప్తే మాత్రం విశ్వక్ సేన్ కి రియల్ షాక్ తగిలినట్టు అవుతుంది. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కి విజయం సాధిస్తే విశ్వక్ మరిన్ని విమర్శలపాలవ్వటం కాయమంటున్నారు. హీరో, రచయిత, దర్శకుడు, నిర్మాతగా బ్లాక్ బస్టర్ చిత్రాలు చేసిన హీరో అర్జున్ సినిమాని చేస్తానని మాటిచ్చి వదిలేయడంతో.. ఇప్పటికే విమర్శలపాలవుతున్నాడు హీరో విశ్వక్ సేన్. అలాంటిది శర్వా ఈ కథతో హిట్ కొడితే విశ్వక్ సేన్ యాటిట్యూడ్ పై మరిన్ని ట్రోల్స్ రావటం పక్క అంటున్నారు.