శర్వానంద్కు యాక్సిడెంట్.. ఏం జరిగిందంటే..?
హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన వెళ్తున్న రేంజ్ రోవర్ కారు ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో శర్వాకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసనం లేదని స్పష్టం చేశారు.
మరికొన్ని రోజుల్లో శర్వానంద్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్ళి చేసుకుంటున్నారు. జనవరిలోనే ఎంగేజ్మెంట్ అవగా.. జూన్ 2,3 తేదీల్లో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. రాజస్థాన్లోని లీలా ప్యాలస్ లో వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో శర్వా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.