Home > Featured > రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్ ట్వీట్

రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్ ట్వీట్

hero sharwanand tweet on his road accident

టాలీవుడ్ హీరో శర్వానంద్ తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందించాడు. ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. . ‘‘ఈరోజు ఉదయం నా కారుకు యాక్సిడెంట్‌ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే అది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సుల వల్ల నేను క్షేమంగా ఉన్నాను. నా గురించి చింతించకండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశాడు.

ఆదివారం తెల్లవారుజామున శర్వానంద్ కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ జంక్షన్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్‌కు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించలేదని తనిఖీల్లో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో శర్వానంద్‌ కారులోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని..ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిది ఏం లేదని తాజాగా శర్వానంద్ క్లారిటీ ఇచ్చాడు.

వచ్చే నెల 3వ తేదీన శర్వానంద్, రక్షితల జంట వివాహం జరగనుంది. జైపుర్​లోని లీలా ప్యాలెస్‎లో వివాహ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే పెళ్లికి ముందు శర్వానంద్ ప్రమాదానికి గురయ్యాడనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాను క్షేమంగా ఉన్నానని శర్వానంద్ ట్వీట్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated : 28 May 2023 4:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top