కొత్త హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్.. తొలి బీఎస్6 బైక్ - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్.. తొలి బీఎస్6 బైక్

November 8, 2019

సుప్రీం కోర్టు ఆదేశాలతో వాహన తయారీ కంపెనీలు భారత్ స్టాండర్డ్ 6 ప్రమాణాలతో కొత్త బండ్లను ప్రవేశపెడుతున్నాయి. హీరో మోటోకార్ప్  తాజాగా తన పాపులర్ మోడల్ స్ప్లెండర్‌ను బీఎస్6తో ఆధునీకరించి ismart పేరుతో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన Splendor మోటార్ సైకిల్ లేటెస్ట్ మోడల్ ఇది. మన దేశంలో BS6 ఇంజిన్ ఉన్న తొలి మోటార్ సైకిల్ ఇదే అని కంపెనీ చెబుతోంది. దీని ధర ఢిల్లీలో(ఎక్స్-షోరూం) రూ.64,900.

Hero Splendor iSmart.

ఫీచర్లు.. 

కొత్త డైమండ్ ఫ్రేమ్ తో వచ్చిన ఈ బైక్ రెడ్, బ్లాక్, టెక్నో బ్లూ, సిల్వర్, హెవీ గ్రే రంగులో లభిస్తోంది. సెల్ఫ్ డ్రామ్ క్యాస్ట్, సెల్ఫ్ డిస్క్ క్యాస్ట్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 116 కిలోలు, స్పోర్ట్స్ 9.5 లీటర్ (ఫ్యుయల్ ట్యాంక్), 240mm డిస్క్ బ్రేక్ (ఫ్రంట్), Fi స్లాండ్.. 9 bhp @7500 rpm,  9.89 Nm torque @ 5500 rpm, 110cc BS6 కంప్లయింట్, ఫ్యుల్ ఇంజెక్టడ్ ఇంజిన్, 130mm డ్రమ్ బ్రేక్ (రియర్-బ్యాక్), 80/100-18 ట్యుబ్ లెస్ టైర్స్ ఇతర ఫీచర్లు.