Home > Featured > రోడ్డుపై కారు తోసిన హీరో సుధీర్ బాబు.. సినిమా షూటింగ్ కాదు..

రోడ్డుపై కారు తోసిన హీరో సుధీర్ బాబు.. సినిమా షూటింగ్ కాదు..

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నడిరోడ్డుపై తన కారును తోశాడు. అయితే ఇదంతా ఏదో సినిమా షూటింగ్‌లో భాగంగా చేసింది మాత్రం కాదు. అలా అని నిజంగానే అతని కారులో పెట్రోల్ అయిపోలేదు. ఇలా చేయడానికి కారణం ఆయన ఫిట్‌నెస్ ట్రిక్ మాత్రమే. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో సుధీర్ బాబు పంచుకున్నాడు. ఇది చూసిన అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు.

నడిరోడ్డుపై కారును తోస్తున్నట్టుగా ఆయన ఓ వీడియో పోస్టు చేశాడు. ఇదో సరికొత్త వ్యాయామం అంటూ కోట్ చేశాడు. వర్కవుట్ ఎప్పుడూ రోటీన్‌గా ఉంటే బోరింగ్‌గా ఉంటుంది. అందుకే కాస్త భిన్నంగా ట్రై చేశాం. మా ట్రైనర్ జాఫర్ అలీ నాతో వెరైటీగా వర్కౌట్ చేయించాడు. రోడ్డుపై నా కారును నా చేత తోయించాడు. దీని వల్ల కొత్త అనుభూతి వచ్చింది. మీ కూడా శరీరంలో కొంత ఇంధనం వేసుకుని కారును ముందుకు తోయండి’ అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం కొన్ని రోజులుగా సుధీర్ బాబు వర్కవుట్ చేస్తున్నాడు. తాజాగా ఇలా కొత్త విధానంలో వ్యాయామం చేశాడు.

Updated : 14 Sep 2019 2:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top